Funky | మరో జాతిరత్నాలు కానుందా..?

Funky | మరో జాతిరత్నాలు కానుందా..?
Funky | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్(Vishwak Sen). హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్. ఈ ఇద్దరి కలయికలో రూపొందుతోన్న చిత్రం ఫంకీ. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్‌కు ప్రేక్షకు(Teaser for the audience)ల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒక రోజు ముందుగా థియేటర్లలో ఫంకీ చిత్రం సందడి మొదలు కానుంది. ఈ సినిమాను 2026లో ఫిబ్రవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ముందుగా ఈ ఫంకీ చిత్రాన్ని 2026 ఏప్రిల్ లో విడుదల చేయాలని నిర్మాతలు అనుకున్నారు. అయితే.. ఇప్పుడు విడుదల తేదీ ముందుకు జరగడంతో.. కాస్త ముందుగానే ప్రేక్షకులు ఈ వినోదాల విందుని(A feast of entertainment) ఆస్వాదించనున్నారు.
దర్శకుడు కె.వి. అనుదీప్ తనదైన స్టైల్ లో కామెడీ విందు అందించేందుకు తిరిగి వస్తున్నారు. ఈసారి రెట్టింపు నవ్వులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమవుతున్నారు. అనుదీప్ దర్శకత్వం(Directed by Anudeep) అంటే వినోదం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. జాతిరత్నాలు సినిమాతో సంచలనాలు సృష్టించిన ఆయన.. మరోసారి విభిన్నమైన కథాంశం, కట్టిపడేసే హాస్యంతో ప్రేక్షకుల మనసు దోచుకోనున్నారని.. ఈ సినిమా విజయం పై చిత్రయూనిట్ గట్టి నమ్మకంతో ఉన్నారు.

Funky | దర్శకుడిగా విశ్వక్..
ఫంకీ చిత్రంలో విశ్వక్ సేన్ సినీ దర్శకుడి పాత్రను పోషిస్తుండటం విశేషం. కొత్త లుక్, కొత్త యాటిట్యూడ్‌తో ప్రేక్షకులను సరికొత్తగా అలరించనున్నారు. ఇప్పటికే టీజర్లో ఆయన నటన, ఎనర్జీ, కామెడీ టైమింగ్ కి ప్రశంసల వర్షం(A shower of praise) కురిసింది. ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతున్న కథానాయిక కయాదు లోహర్ తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించారు. తెర పై విశ్వక్-కయాదు జోడి కొత్తగా, అందంగా కనిపిస్తూ.. ఇప్పటికే యువత మనసులలో ప్రత్యేక స్థానాన్ని(A special place) సంపాదించుకుంది. సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవనుంది. టీజర్ తోనే సంగీతం ఎంత కొత్తగా, కట్టిపడేసేలా ఉండనుందో స్పష్టమైంది.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీతనానికి, విజయవంతమైన చిత్రాలకు పేరుగాంచిన నిర్మాణ సంస్థల నుంచి వస్తున్న సినిమా కావడంతో, ఫంకీ పై సహజంగానే భారీ అంచనాలు(Huge expectations) ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఫంకీ చిత్రం ప్రేక్షకులకు నవ్వుల విందుని అందిస్తుందని.. మరో జాతిరత్నాలు కానుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా ఫంకీ.. మరో జాతిరత్నాలు అవుతుందేమో చూడాలి.

