జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు..

జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు..
గంపలగూడెం, ఆంధ్రప్రభ : జనసేన పార్టీ 13వ ఆవిర్భావ వేడుకలు మండలంలోని తోట మూల జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు చింతలపాటి వెంకటకృష్ణారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు తినిపించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలని రానున్న రోజుల్లో జనసేన పార్టీకి మరిన్ని విజయాలు వచ్చేందుకు కృషి చేయాలని అన్నారు.
అధినేత పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి అనేక గ్రామాలలో అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా నిదులు ఏర్పాటు చేసారని పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. కూటమి ఐక్యత కోసం బలంగా నిలబడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు బి.బాలకృష్ణ, జె.రామకృష్ణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పసుపులేటి మాధవరావు, ప్రధాన కార్యదర్శి ఉట్టికుంట కృష్ణ, తెదేపా నాయకుడు బూరుగు నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
