అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి…

అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి…
కుంటాల, ఆంధ్రప్రభ : అభివృద్ధికి నిధులు మంజూరు చేసే విధంగా కృషి చేయాలని కోరుతూ సోమవారం కల్లూర్ సర్పంచ్ పెంట వార్ దశరథ్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కు వినతి పత్రంతో తన కార్యాలయంలో సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు గ్రామంలోని మౌలిక వసతుల కల్పన, సిసి రహదారులు, డ్రైనేజీలు, రూర్బన్ పార్కుకు నిధులు, అదేవిధంగా గ్రామంలో వివిధ కాలనీలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు నిధులను మంజూరు చేసేందుకు కలెక్టర్ పూర్తి స్థాయిలో నిధులు మంజూరు అయ్యేలా కృషి చేయాలని, గ్రామాన్ని సస్యశ్యామలంగా అభివృద్ధి చేసుకున్నందుకు తాము నిరంతరం గ్రామ అభివృద్ధికి అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.
అదేవిధంగా తమ గ్రామంలో అర్హులైన నిరుపేదలకు సైతం ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేయాలని పెన్షన్ లేక కొందరు ఇబ్బందులు పడుతున్నారని వాటిని మంజూరు చేసేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించిన కలెక్టర్ కల్లూరు గ్రామ పంచాయతీ అభివృద్ధికి అధికారుల సమన్వయంతో అభివృద్ధికి కృషి చేయాలని అందరి సమన్వయంతోనే అభివృద్ధి జరుగుతుందని కలెక్టర్ వివరించారు. ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులను పక్కదారి పట్టకుండా సస్యశ్యామలంగా అభివృద్ధి చేసుకోవాలని నిధులు మంజూరుకు తన వంతు సహాయ సహకారాలు కృషి చేస్తామని పేర్కొన్నట్టు ఆయన తెలిపారు.
