Funding | రావిరాలను అభివృద్ధి చేస్తా..

Funding | రావిరాలను అభివృద్ధి చేస్తా..

  • కడారి ప్రశాంతి

Funding | నెల్లికుదురు, ఆంధ్రప్రభ : నెల్లికుదురు మండలంలోని రావిరాల గ్రామ సర్పంచ్ గా తనను ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి కడారి ప్రశాంతి అన్నారు. నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులతో కలిసి జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్(Engineering)లో ఎంటెక్ చదివి, ఉన్నతమైన మంచి ఉద్యోగాన్ని వదులుకొని గ్రామ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల ఒరిలోకి వచ్చినట్లు తెలిపారు.

గ్రామంలోని ప్రజలకు విద్య, విద్యుత్, మంచినీటి సౌకర్యం లాంటి మౌలిక వసతుల కల్పనకు ఎలాంటి లోటు రాకుండా గ్రామ పరిపాలన చేస్తానన్నారు. గ్రామంలో గ్రామ దేవతల ప్రతిష్టాపనకు నిధులు(Funding) సమాకూర్చి అభివృద్ధి చేస్తానన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు త్వరగా అయ్యేలా కృషి చేస్తానన్నారు.

పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఒక్కసారి గెలిపించి అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు.

Leave a Reply