Funding | దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తా

Funding | దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తా

Funding | కుంటాల, ఆంధ్రప్రభ : ముతోల్ నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తాన‌ని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. ఈ రోజు మండల కేంద్రమైన కుంటాల ఇలవేల్పు గజ్జలమ్మ ఆలయ ప్రాంగణంలోని 32 లక్షల రూపాయలతో రాజగోపురం నిర్మాణాన్ని ఆవిష్కరించారు. అనంతరం ముందుగా ఆయన గజ్జలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు.

ఆయ‌న మాట్లాడుతూ ముధోల్ నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తానని పేర్కొన్నారు. ఇప్పటికే ముధోల్ నియోజకవర్గంలోని అత్యధికంగా దేవాలయాల అభివృద్ధికి నిధులకు ప్రాధాన్యత ఇచ్చిన ఘనత తనదేన‌ని మరింత అభివృద్ధికి కృషి చేస్తానని కుంటాల మండలంలోని మరికొన్ని గ్రామాల్లో దేవాలయాల అభివృద్ధి పనులు అసంపూర్తిగా జరగడంతో త్వరలోనే ఆ పనులను కూడా పూర్తిచేసి ప్రారంభించేలా చర్యలు చేపడతాన‌న్నారు.

సంబంధిత కాంట్రాక్టర్లకు తెలిపి పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటానని అన్నారు. గ్రామాలలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ నిధులతో అన్ని గ్రామాల అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు కృషిచేసి అభివృద్ధికి పాటుపడతాన‌ని తెలిపారు. అనంతరం గజ్జలమ్మ ఆలయ ఆరవ వార్షికోత్సవ పోస్టర్ లను ఆలయ కమిటీ సభ్యులతోపాటు స్థానిక నాయకులతో ఆయన ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జక్కుల గజేందర్, ఎంపీడీవో అల్లాడి వనజ, మాజీ ఎంపీపీ ఆప్కా గజ్జరం యాదవ్, పిప్పర వెంగల్ రావు, జుట్టు మహేందర్, ఆయా గ్రామాల సర్పంచులు, స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply