జాతి, మతం, రంగు, ప్రాంతం, మధ్య తేడా లేకుండా ఏర్పడేదే స్నేహ బంధం. ప్రతీ ఒక్కరి జీవితం లో వీడ‌లేని స్నేహితుడు ఒక్క‌రైనా ఉంటారు. స్నేహనికి వయసు పరిమితి ఉండ‌దు. ఏ వయసులోనైనా, ఎవరితోనైనా స్నేహ బంధం (Friendship) ఏర్పడవచ్చు.

జీవితం తల్లిదండ్రులు, కుటుంబం తర్వాత అంతగా విలునిచ్చే బంధం ఏదైనా ఉందంటే అది స్నేహం ఒక్క‌టే. హద్దులు లేకుండా ఎలాంటి విషయాలనైనా పంచుకోవడం, ఒకరినొకరు అంగీకరించుకోవడమే నిజమైన స్నేహం (true friendship). ఏ రంగంలోనైనా శాశ్వ‌త శ‌త్రువులు (Eternal enemies) ఉండ‌రు.. శాశ్వ‌త మిత్రులు ఉండ‌రు అంటారు. అది నిజ‌మే క‌దండీ.. ముఖ్యంగా ఇది రాజ‌కీయాల్లో ప‌క్కా వ‌ర్తిస్తుంది.

పొలిటిక‌ల్ ఫ్రెండ్‌షిప్‌

రాజకీయ పొత్తుల (Political alliances) గురించి మాట్లాడాలంటే, రాజకీయాల్లో స్నేహాలు, పొత్తులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కొన్ని పొత్తులు తాత్కాలికంగా ఉంటాయి, మరికొన్ని దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి. కొన్ని స్నేహాలు బంధాలుగా మారి రాజకీయాల్లో కలిసి వస్తాయి. మరికొన్ని బద్ద శత్రువులుగా కూడా మారుతాయి. రాజకీయాల్లో స్నేహాలు, పొత్తులు అనేవి స్వార్థ రాజకీయాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి.

ఎన్నికల్లో గెలవడం కోసం లేదా ఏదైనా ప్రత్యేక ప్రయోజనం కోసం తాత్కాలికంగా పొత్తులు పెట్టుకుంటారు. ఎన్నికల తర్వాత ఆ పొత్తులు తెగిపోతాయి. కొన్ని రాజకీయ పార్టీలు సిద్ధాంతాలపరంగా, ఆచరణాత్మకంగా కలిసి పనిచేయడానికి శాశ్వతంగా పొత్తులు పెట్టుకుంటాయి. రాజకీయాల్లో పొత్తులు నిలబడాలంటే, నమ్మకం, విశ్వాసం చాలా ముఖ్యం. ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఒకరినొకరు గౌరవించుకోవడం వంటివి అవసరం. రాజకీయాల్లో పొత్తులు పెట్టుకోవడానికి ప్రధాన కారణం స్వార్థం, ప్రయోజనం. తమ రాజకీయ భవిష్యత్తు కోసం లేదా పార్టీ ప్రయోజనాల కోసం పొత్తులు పెట్టుకుంటారు.

రాజకీయాల్లో పొత్తుల చరిత్ర ఎప్పటినుంచో ఉంది. రాజుల కాలం నుండి, ఇప్పటి రాజకీయాల వరకు పొత్తులు, స్నేహాలు కొనసాగుతున్నాయి. రాజకీయాల్లో స్నేహాలు, పొత్తులు అనేవి ఒక నాటకం లాంటివి. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఒకప్పుడు స్నేహితులుగా ఉన్నవారు, రాజకీయాల్లోకి రాగానే బద్ధ శత్రువులుగా మారడం మనం చూస్తూనే ఉంటాం. మ‌రికొంద‌రు శ‌త్రువులుగా ఉన్న‌వారు మంచి స్నేహితులుగా మారుతారు. ఇది ఏపీ రాజ‌కీయాల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

బాబు, మోదీ మ‌ధ్యలో ప‌వ‌న్

చంద్రబాబు – మోదీ (Chandrababu – Modi) ఇద్దరూ రాజ‌కీయ మిత్రులే. ఇద్దరూ పొలిటిక‌ల్ (Political) ఉద్ధండులే. ఒక‌ప్పుడు రాజ‌కీయంగా మంచి మిత్రులైనా త‌ద‌నంత‌రం వీరి మ‌ధ్య ఉప్పు.. నిప్పు అన్న మాదిరిగా దూరం పెరిగింది. కానీ వీరిద్ద‌రిని క‌ల‌ప‌డానికి జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాన్ ఎంట్రీ ఇచ్చారు. 2024 ఏపీ అసెంబ్లీ (AP Assembly) ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ ఇద్ద‌రిని క‌ల‌ప‌డానికి ప‌వ‌న్ చేసిన కృషి విశేష‌మైన‌ది.

కత్తులు దూసుకుంటున్న టీడీపీ, బీజేపీ(TDP, BJP)ని కలుపుతానని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చెప్ప‌డమే కాదు చేసి చూపించాడు. అప్పట్లో మోదీ, చంద్రబాబు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకున్నా వారిద్ద‌రి చేతులు క‌ల‌ప‌డంలో పవన్ ఉన్నార‌నేది నిజం. 2024 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇలా ‘‘ముగ్గురు మొన‌గాళ్లు’’ స్నేహ హ‌స్తం క‌లిపారు. కూట‌మిగా మారి ఆ ఎల‌క్ష‌న్ల‌లో అఖండ విజ‌యం సాధించారు. దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.. స్నేహ బంధం ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని అందిస్తుందో.

ఫ్రెండ్ షిప్ డే చరిత్ర

ఫ్రెండ్‌షిప్ డే (Friendship Day) ఆలోచనను 1958లో జాయిస్ హాల్ తొలిసారిగా అందించారు. జాయిస్ హాల్ హాల్‌మార్క్ కార్డ్‌ల స్థాపకుడు. స్నేహితుల మధ్య బంధాల ద్వారా ప్రేరణ పొందారు. ఆ తర్వాత స్నేహితులు తమ స్నేహాన్ని, ప్రేమను పంచుకోవడంతో పాటు జరుపుకోవాలనే ఆలోచన అతని మదిలో వచ్చింది. మిస్టర్ హాల్ (Mr. Hall) ఆలోచనను ప్రజలు చాలా ఇష్టపడ్డారు. ఇక క్రమంగా ఎక్కువ మంది ఫ్రెండ్‌షిప్ డేని జరుపుకోవడం ప్రారంభించారు. .

అలా ప్రపంచవ్యాప్తంగా స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభమైంది. 1998లో ఐక్యరాజ్యసమితి (United Nations) జూలై 30ని అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా ప్రకటించింది. ఆ తర్వాత, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2011 సంవత్సరంలో ఆగస్టు మొదటి ఆదివారాన్ని ఫ్రెండ్‌షిప్ డేగా జరుపుకోవాలని నిర్ణయించింది. ఫ్రెండ్‌షిప్ డే ప్రజలు, దేశాలు, సంస్కృతులు, విభిన్న వ్యక్తుల మధ్య ప్రేమ, శాంతిని సృష్టించడంలో సహాయపడుతుంది. మనుషుల మధ్య బంధానికి వారధిలా పనిచేస్తుంది. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని జూలై 30న జరుపుకుంటారు. కానీ అమెరికా, ఇండియా లాంటి దేశాల్లో ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్ షిప్ డేగా జరుపుకుంటారు.

Leave a Reply