స్నేహితురాలికి భరోసా కల్పించిన మిత్ర బృందం..

స్నేహితురాలికి భరోసా కల్పించిన మిత్ర బృందం..
చిట్యాల, ఆంధ్రప్రభ : తనతో పాటు చదువుకున్న చిన్ననాటి స్నేహితురాలికి అండగా నిలిచి కుటుంబానికి భరోసా కల్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. చిట్యాల పట్టణానికి చెందిన 1995- 96 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం నాడు తనతో చదువుకున్న పిల్లుట్ల వరలక్ష్మి భర్త పిల్లుట్ల వీరయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మిత్ర బృందం నలభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని చిన్ననాటి స్నేహితురాలికి అందజేశారు. ఈ కార్యక్రమంలో నక్కన బోయిన మల్లేష్ యాదవ్, ఎం లింగయ్య, బి శ్రీనివాస్, బి సునీత, అలివేలు పాల్గొన్నారు.

