French soldier killed : ఇరాక్ లో మ‌రో టెర్ర‌ర్ Andhra Prabha News

French soldier killed : ఇరాక్ లో మ‌రో టెర్ర‌ర్ Andhra Prabha News

  • కుర్దిస్థాన్ శిక్ష‌ణ శిబిరంపై దాడి
  • ఫ్రెంచి అధికారి మృతి,
  • 6 సైనికుల‌కు తీవ్ర గాయాలు

( ఆంధ్ర‌ప్ర‌భ. బాగ్దాద్ / పారిస్)

ఇరాక్ లో కుర్దిష్ పెష్మెర్గా దళాల కు యుద్ధ శిక్ష‌ణ శిబిరంపై డ్రోన్ దాడిలో ఓ ప్రెంచి అధికారి మృతి చెండాడు. ఆరుగురుగు ఫ్రెంచి సైనికులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అమెరికా, ఇజ్రాయెల్ జాయింట్ ఆప‌రేష‌న్ ఎథిక్ ఫ్యూరీ జ‌రుగుతున్న వేళ‌.. ఇరాక్ లో ఇత‌ర దేశాల సైనిక కార్య‌క‌లాపాల‌పై స్థానిక మిలీషియా క‌న్నెర్ర చేసింది.

French soldier killed

ఈ కార‌ణంగానే ఉత్తర ఇరాక్‌లోని ఎర్బిల్‌ (Erbil) ప్రావిన్స్‌లోని ఒక సైనిక స్థావరంపై డ్రోన్‌ దాడి జరిగింది. కుర్దిష్ పెష్మెర్గా దళాలు, అంతర్జాతీయ సంకీర్ణ దళాలు (ఫ్రెంచ్ దళాలతో సహా) సంయుక్తంగా ప‌డుస్తున్న స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఫ్రెంచ్ ఆర్మీ చీఫ్ వారెంట్ ఆఫీసర్ ఆర్నాడ్ ఫ్రియాన్ (Chief Warrant Officer Arnaud Frion) మరణించారు. 7వ బెటాలియన్ ఆఫ్ ఛాసియర్స్ ఆల్పిన్స్ (7th Battalion of Chasseurs Alpins) కు చెందిన అధికారిగా ఆయ‌న‌ను గుర్తించారు. ఈ దాడిలో మరో ఆరుగురు ఫ్రెంచ్ సైనికులు గాయపడ్డారు.

French soldier killed : దాడి చేసింది ఎవరు?

French soldier killed

ఈ దాడిని ఇరాన్ అనుకూల మిలిటెంట్ గ్రూపులు (ప్రో-ఇరానియన్ ఫ్యాక్షన్స్) చేసినట్లు ఫ్రెంచ్ అధికారులు అనుమానిస్టున్నారు. ఇటీవల మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై దాడులకు ప్రతిచర్యగా ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

French soldier killed


ఇరాక్ కేంద్రంగా పనిచేసే ‘అషాబ్ అల్-కాఫ్’ (Ashab Alkahf) అనే ప్రో-ఇరానియన్ గ్రూపు, ఈ ప్రాంతంలోని ఫ్రెంచ్ ప్రయోజనాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇరాక్‌లో ‘ఆపరేషన్ షమ్మల్’ (Operation Chammal) లో భాగంగా ఇస్లామిక్ స్టేట్ (ISIS) కి వ్యతిరేకంగా పోరాడటానికి, స్థానిక దళాలకు శిక్షణ ఇవ్వడానికి ఫ్రెంచ్ ద‌ళాలు ఇక్కడ ప‌ని చేస్తున్నాయి. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు , ఇది “అంగీకరించలేనిది” అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ALSO READ : Iran Backed Militia : కూలిన US KC-135 Andhra Prabha News

Leave a Reply