French Open | చరిత్ర సృష్టించిన‌ కొకో గాఫ్..

ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ టైటిల్ కోసం ప్రపంచ నంబర్ వన్, నంబర్ 2 క్రీడాకారిణుల మధ్య జరిగిన ఉత్కంఠ ఫైనల్లో.. ప్రపంచ నంబర్ వన్ ఆర్యనా సబాలెంకాపై అమెరికన్ టెన్నిస్ స్టార్ కొకో గాఫ్ అద్భుత విజయం సాధించింది.

రోలాండ్ గారోస్‌లో జరిగిన ఈ అద్భుతమైన ఫైనల్‌లో.. ఓ సెట్ ని కోల్పోయినా, గాఫ్ పట్టుదలతో తిరిగి బౌన్స్‌ బ్యాక్ అయ్యి.. 6-7 (5/7), 6-2, 6-4 తేడాతో ఘన విజయం సాధించింది. దాదాపు రెండు గంటల 38 నిమిషాల పాటు సాగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గాఫ్ నిగ్రహంగా ఆడి విజయం దక్కించుకుంది. దీంతో కోకో గౌఫ్ తన కెరీర్‌లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌ను గెలుచుకుంది.

ఇదే సమయంలో, సబాలెంకా వరుసగా రెండో గ్రాండ్ స్లామ్ ఫైనల్‌లో ఓటమి పాలవడం గమనార్హం. గతంలో జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మాడిసన్ కీస్ చేతిలో ఓడిపోయింది. గాఫ్ ఇప్పటివరకు సబాలెంకాతో తలపడిన 11 మ్యాచ్‌లలో 6 విజయాలు సాధించి 6-5 ఆధిక్యంలో నిలిచింది.

Leave a Reply