(ఆంధ్రప్రభ, అరకులోయ రూరల్ )
అల్లూరి సీతారామరాజు జిల్లా_ అరకులోయ ఏవోబి లో డుడుమ జలపాతం లో ఒడిషా యువకుడు గల్లంతయ్యాడు. స్నేహితులతో జలపాతం చూసేందుకు వచ్చిన యువకులు డ్రోన్ తో వీడియోలు తీసుకున్నారు. ఒక్కసారి గా జలపాతం పరవళ్లు పెరగడంతో మధ్యలో ఫోటోలు దిగుతున్న ఒక యువకుడు చిక్కకున్నాడు. ఆ యువకుడిని రక్షించేందుకు తాళ్లతో స్నేహితుల ప్రయత్నం చేసారు . ఈలోపు జలపాతం ప్రవాహం మరింత పెరగడంతో స్నేహితులు కళ్లముందే ఆ యువకుడు కొట్టుకుపోయాడు.