Free medical camp | పల్లెవాడలో ఉచిత వైద్య శిబిరం
- ఎంవీకే శత జయంతి సందర్భంగా ఏర్పాటు
- శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్
Free medical camp | ఏలూరు, ఆంధ్రప్రభ : పల్లెవాడ గ్రామ భూమి పుత్రులు, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, ఆర్త జన బంధువు, దివిసీమ గాంధీగా ఖ్యాతి గడించిన గాంధేయవాది స్వర్గీయ(Gandhian heavenly) మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా శనివారం వారి స్వగ్రామం ఏలూరు జిల్లా పల్లెవాడలో ఉచిత మెగా వైద్య శిబిరం, కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు.

పల్లెవాడ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. ఏలూరు ఆశ్రమం హాస్పిటల్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆకివీడు, ఎల్‌వీ. ప్రసాద్ కంటి ఆసుపత్రి వారి సంయుక్త సహకారంతో నిర్వహించిన ఈ ఉచిత మెగా వైద్య శిబిరం, ఉచిత మెగా కంటి వైద్య శిబిరాలకు విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో గ్రామస్థులు తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. శిబిరాలను అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, బ్లూ వెయిట్ సంస్థ అధిపతులు జుంగా దాస్ – మహాలక్ష్మి, జుంగా కృష్ణకిషోర్ – భాను, జుంగా రవికిరణ్ – హనీషా పర్యవేక్షించారు.

