ఉచిత గాలికుంటు శిబిరం ఆకస్మిక తనిఖీ

చిట్యాల, ఆంధ్రప్రభ ; చిట్యాల మండలంలోని పాడి రైతులు అందరూ మూగజీవాలకు గాలికుంటు నిర్మూలన టీకాలు వేయించాలని డాక్టర్ జీవి రమేష్ అన్నారు.

నల్లగొండ జిల్లా నకరికల్లు నియోజకవర్గం చిట్యాల మండలం లో జరుగుతున్న పశువులకు ఉచిత గాలికుంటు నిరోధక టీకాల కార్యక్రమాన్ని పశువైద్య, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్, నల్గొండ డా.జి.వి.రమేష్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి వ్యాక్సినేషన్ ప్రక్రియను, రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి రైతులు అందరూ తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి అని పేర్కొన్నారు. ఆయన వెంట మండల పశువైద్యాధికారి డా.వి.అభినవ్,డా.అమరేందర్, విఎల్ఓ పి.శ్రీనివాస్, ఎల్ఎస్ఎ మల్లారెడ్డి, గోపాలమిత్ర సత్యనారాయణ,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply