మెదక్ : మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ లో విషాదం చోటుచేసుకుంది. వరికోత యంత్రం ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని వరికోత యంత్రం ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఘటనకు కారణమైన డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Crime | వరికోత యంత్రం ఢీకొని.. నాలుగేళ్ల బాలుడు మృతి
