నాలుగు రాష్ట్రాలు అప్ర‌మ‌త్తం

నాలుగు రాష్ట్రాలు అప్ర‌మ‌త్తం

  • ఏపీ, తెలంగాణ‌లో ఐదు రోజులు భారీ వ‌ర్షాలు
  • మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరిక
  • క‌డ‌ప‌, అక్టోబ‌ర్ 25(ఆంధ్ర‌ప్ర‌భ‌) : బంగాళాఖాతంలో ఏర్ప‌డిన తీవ్ర అల్ప‌పీడ‌నం వాయుగుండంగా మారింద‌ని.. రేపటికి తీవ్ర వాయుగుండంగా బలపడి.. ఎల్లుండి తుఫాన్‌గా మారే ప్ర‌మాదముంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. తుఫాన్‌కు థాయిలాండ్‌ సూచించిన మేర‌కు ‘మంతా’గా నామకరణం చేసిన‌ట్లు తెలిపారు. తుఫాన్ ఈ నెల 28న మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ దగ్గరలో తీరం దాటుంద‌ని తెలిపారు. దీని ప్ర‌భావంతో 90-110 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయ‌ని తెలిపారు. ప్రస్తుతం పోర్ట్‌బ్లెయిర్‌కు పశ్చిమ-నైరుతిలో 420 కి.మీ దూరంలో, కాకినాడకు ఆగ్నేయంగా 1000 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయిన‌ట్లు తెలిపారు.
  • తుఫాన్‌ ప్రభావం ఏపీ, తమిళనాడు, ఒడిశా, బెంగాల్‌లో తీవ్రంగా ఉంటుంద‌ని, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. తుఫాన్‌ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. మత్య్సకారుల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Leave a Reply