Foundation | ప్రభుత్వ పాఠశాలకు కార్పెట్ల పంపిణీ

Foundation | ప్రభుత్వ పాఠశాలకు కార్పెట్ల పంపిణీ
Foundation | మునుగోడు, ఆంధ్రప్రభ : మండలంలోని కొంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు నూతన సంవత్సర శుభ సందర్భంగా వెదిరె పూలమ్మ ఫౌండేషన్(Poolamma Foundation) సభ్యులు, ఉప సర్పంచ్ వెదిరె విజేందర్ రెడ్డి పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల అవసరాలకు కావలసిన కార్పెట్లను వెదిరె పూలమ్మ ఫౌండేషన్ సహకారంతో అందజేశారు.
అనంతరం ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థిని విద్యార్థులకు, పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జీడిమెట్ల నిర్మల, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మోగుదాల శ్యామల, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
