హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో నోటీసులు అందించింది. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
ఈ క్రమంలో ఏసీబీ తనకు నోటీసులు జారీ చేసిన విషయాన్ని కేటీఆర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఫార్ములా ఈ కేసులో మే 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ నాకు నోటీసు ఇచ్చింది. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కేసు పూర్తిగా రాజకీయ వేధింపు అయినప్పటికీ, నేను ఖచ్చితంగా ఏజెన్సీలతో సహకరిస్తాను.
ఇప్పటికే పలు కార్యక్రమాల కోసం లండన్, అమెరికాకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాను. నేను తిరిగి వచ్చిన వెంటనే వారి ముందు హాజరవుతాను. ఏసీబీ అధికారులకు కూడా ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా తెలిపాను’అని అన్నారు.అదే సమయంలో 48 గంటల క్రితం, నేషనల్ హెరాల్డ్ కేసులో డబ్బు సరఫరా చేసినందుకు ఈడీ ఛార్జిషీట్‌లో రేవంత్ రెడ్డి పేరు కనిపించింది. నీలాండరింగ్ కేసులో రేవంత్ రెడ్డి ప్రమేయం ఉందని ఒక్క బిజెపి నాయకుడు కూడా రేవంత్ రెడ్డిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు’ అని ప్రశ్నించారు.