Former ZPTC | నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం..

Former ZPTC | ఊట్కూర్, ఆంధ్రప్రభ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని నారాయణపేట జిల్లా ఊట్కూర్ మాజీ జెడ్పీటీసీ సూర్యప్రకాశ్ రెడ్డి ఈ రోజు విమర్శించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం ద్వారా బీజేపీ ప్రభుత్వం గాంధీజీ ఆశయాలను మరిచిపోతుందన్నారు. ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేస్తూ 100 రోజుల పని హామీని కాగితాలకే పరిమితం చేస్తుందని ఆరోపించారు.

కేంద్రంనిధులు సక్రమంగా విడుదల చేయకపోవడం వల్ల పేద కూలీలకు పని వేతనాలు అందలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై మోపుతూ బాధ్యతల నుండి బిజెపి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. గ్రామీణ పేదల జీవనాధారమైన ఉపాధి పథకాన్ని బలహీనపరుస్తూ ప్రజల హక్కులను కాలరాస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలు పేదలకు వ్యతిరేకంగా కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి ఉపాధి హామీ పథకం యధావిదంగా చేపడుతూ మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలని విజ్ఞప్తిచేశారు.

Leave a Reply