Former Prime Minister | షేక్ హసీనాకు 10ఏళ్ల జైలు శిక్ష..

Former Prime Minister | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు మరో బిగ్‌షాక్‌ తగిలింది. ఢాకాలోని పూర్వాచల్ న్యూటౌన్ ప్రభుత్వ ప్రాజెక్టులో ప్లాట్ల కేటాయింపుపై అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరిపిన కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. ఏకంగా 10 ఏళ్ల పాటు జైలుశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. రెండు వేర్వేరు కేసుల్లో తలా ఐదేళ్ల చొప్పున పదేళ్ల కఠిన కారాగార శిక్షను ఖరారు చేసింది.

ఢాకా ప్రత్యేక జడ్జి కోర్టు న్యాయమూర్తి రాబియుల్‌ ఆలం ఈ తీర్పును వెలువరించారు. ఈ కేసులో షేక్‌ హసీనా మాత్రమే కాకుండా ఆమె కుటుంబ సభ్యులు కూడా దోషులుగా తేలారు. హసీనా మేనకోడలు, ప్రస్తుతం బ్రిటన్ పార్లమెంటు సభ్యురాలిగా తులిప్‌ రిజ్వానా సిద్ధిఖ్‌కు కూడా షాక్ తగిలింది. ఆమెకు రెండు కేసుల్లో రెండేళ్ల చొప్పున నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది.

Leave a Reply