నివాళులర్పించిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, నాయకులు

పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో అకాల మరణం చెందిన వ్యక్తి పార్థివదేహానికి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. శనివారం పరకాల పట్టణంలోని 17వ వార్డుకు చెందిన పంచగిరి సంపత్ ( స్టాంప్ వెండర్ రిజిస్ట్రేషన్) తండ్రి పంచగిరి సాంబశివుడు తెల్లవారుజామున మరణించగా వారి పార్థివ దేహానికి పరకాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి, మాజీ కుంకుమేశ్వర ఆలయ చైర్మన్ చందుపట్ల నరసింహ రెడ్డి, మాజీ కౌన్సిలర్ శనిగరం రజినీ నవీన్ లు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ దుప్పటి సుజయ్ రణదేవ్, బిఆర్ఎస్ 17వ వార్డు నాయకులు తోట రవీందర్, యం.డి అల్తాఫ్, చెట్టి ఏసు, బండారి కోమల, షాహిన్, జరీనా, సారంగపాణి తదితరులు పాల్గొని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave a Reply