Former MLC | స‌ల్లంగా చూడు త‌ల్లీ..

Former MLC | స‌ల్లంగా చూడు త‌ల్లీ..

  • మేడారంలో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
  • సమ్మక్క–సారలమ్మలకు ప్ర‌త్యేక పూజ‌లు

Former MLC | ఎండపల్లి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా, ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలోని సమ్మక్క–సారలమ్మల‌ను మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి కోసం దేవతలను ప్రార్థించారు.

అనంతరం గ్రామస్తులతో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల విశ్వాసాలు, సంప్రదాయాలను పరిరక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటిపర్తి శైలంధర్ రెడ్డి, వెల్గటూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండటి గోపిక, సర్పంచ్ సంగ రమేష్ యాదవ్, ప్రముఖ వైద్యుడు డా.గురువా రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ శైలంధర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గాజుల మల్లేశం, కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply