సాయంత్రం అంత్యక్రియలు

ఉమ్మడి రంగారెడ్డి బ్యూరో, ఆంధ్రప్రభ : చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి (84) ఇక లేరు. అపోలో చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఈ రోజు సాయంత్రం మహాప్రస్థానం లో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన బంధువులు తెలిపారు.

  • చేవెళ్ల నియోజక వర్గం మొయినాబాద్ మండలం పెద్దమంగళారం ఆయన స్వగ్రామం.
  • 1983 నుండి1985 సంవత్సరం వరకు ఎమ్మెల్యే గా కొనసాగారు.
  • హైదరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రెండు పర్యాయాలు పోటీ చేశారు.
  • 1980లో ఎన్ ఎస్ ఎస్ ఏర్పాటు చేశారు.
  • జూబ్లీహిల్స్ హౌసింగ్
    ప్రెసిడెంట్ గా పని చేశారు.
  • ఉమ్మడి రాష్ట్రంలో స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మెన్ గా కూడా పని చేశారు.
  • కొండా లక్ష్మారెడ్డి మృతి పట్ల చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంతాపం తెలిపారు.

Leave a Reply