Former MLA | పేదలకు దుప్పట్లు పంపిణీ

Former MLA | పేదలకు దుప్పట్లు పంపిణీ

Former MLA | మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయస్వామి దేవాలయం వద్ద వృద్ధులకు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఉలన్ దుప్పట్లను పంపిణీ చేశారు .అమావాస్య సందర్భంగా మాజీ ఎమ్మెల్యే (Former Mla) శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. ఈసందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వద్ద భిక్షాటన చేస్తున్న 25మంది వృద్ధులకు చిట్టెం దుప్పట్లను పంపిణీ చేశారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చలికాలం (Winter Season) కావడం వల్ల వృద్ధులు చలితో పడుతున్న ఇబ్బందులను గుర్తించి వారికి ఉలన్ దుప్పట్లను అందజేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలన్నదే తన అభిమతమని ఆయన పేర్కొన్నారు. వృద్ధులు చలి నుండి కాపాడుకోవడానికి తనవంతుగా దుప్పట్లు అందజేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ నిరుపేదలకు సహాయం అందించాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బాజీ మార్కెట్ (Market) కమిటీ చైర్మన్ పి.నరసింహ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు చిన్న హన్మంతు, అన్వర్ హుస్సేన్, కుమ్మరి రవి, మొగులప్ప, ఈశ్వర్ యాదవ్, శివారెడ్డి, నేతాజీ రెడ్డి, జుట్ల శంకర్, జె.సాగర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం వద్ద కూడా వృద్ధులకు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, దుప్పట్లను అందజేశారు.

Leave a Reply