ఇంటింటి ప్రచారంలో మాజీ మార్కెట్ చైర్మన్ నర్సింహా గౌడ్

మక్తల్ , ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో 12వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థిగి బరిలో నిలిచిన ఎండి మోయిజ్ హుస్సేన్ ను ఆదరించి భారీ మెజారిటీ తో మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిపించాలని మాజీ మార్కెట్ చైర్మన్ పి.నర్సింహా గౌడ్ విజ్ఞప్తి చేశారు. శనివారం ఎండి మోయిజ్ హుస్సేన్ కు 12వ వార్డు పరిధిలో కు మద్దతుగా శనివారం ఇంటింటి ప్రచారంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు పరిధిలో ఇంటింటికి వెళ్లి పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఓటర్లను కలుసుకుని ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ద్వారా మాత్రమే మక్తల్ అభివృద్ధి సాధ్యమని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన ఏమీ చేయలేదన్నారు.

రెండేళ్లుగా చేయని అభివృద్ధి ఇకముందు చేస్తారని అంటే ఎవరు నమ్మడం లేదన్నారు. కాంగ్రెస్ నేతలవి మాయమాటలు తప్ప చేతల ప్రభుత్వం కాదని అన్నారు.కేవలం బిఆర్ఎస్ మాత్రమే అభివృద్ధి చేయగలుగుతుందని అన్నారు. అందుకే ఈ నెల 11న జరఖనున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిగా 12వ వార్డు నుండి బరిలో నిలిచిన ఎండి మోయిజ్ హుస్సేన్కా రు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు అన్వర్ హుస్సేన్, 12వ వార్డ్ ఇంచార్జీ జమీల్ అహ్మద్, ఎండి సాదిక్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply