భారత క్రికెట్ మాజీ స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ (ShikharDhawan) కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నుంచి పెద్ద షాక్ తగిలింది. అక్రమ బెట్టింగ్ యాప్ (1xBet) వ్యవహారంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఆయనను విచారించేందుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. తెలంగాణలోని మనీలాండరింగ్ కేసు (MoneyLaundering) లో ధావన్ స్టేట్‌మెంట్‌ను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద రికార్డు చేయనున్నారు. ఈడీ అధికారులు ప్రాథమిక దర్యాప్తులో ధావన్ (1xBet) యాప్‌కు ఎండార్స్‌మెంట్‌లు చేసినట్లు గుర్తించినట్లు సమాచారం.

గత నెలలో ఇదే కేసులో మరో మాజీ క్రికెటర్ సురేష్ రైనా (SureshRaina) ను కూడా విచారించిన విషయం తెలిసిందే. అనేక పెట్టుబడిదారులను మోసం చేసిన ఆరోపణలతో (1xBet) యాప్‌పై ఈడీ విస్తృత దర్యాప్తు కొనసాగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రియల్ మనీ ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధిస్తూ చట్టాన్ని తీసుకురావడం, యువత వ్యసనాలు మరియు ఆర్థిక మోసాలను అరికట్టడమే లక్ష్యమని అధికార వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply