Former DCC President | ఉపాధి హామీ పథకం పేరు మార్చొద్దు….
Former DCC President | దండేపల్లి, ఆంధ్రప్రభ : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చి పథకాన్ని నిర్వీర్యం చేసే విధానం కేంద్ర ప్రభుత్వం మార్చుకోవాలని మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. ఈరోజు దండేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో పార్టీ శ్రేణులు ఉపాధి కూలీలతో నిరసన చేపట్టిన ఆమె డీఆర్డీఓ కిషన్ కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ… మోడీ ప్రభుత్వానికి ప్రజా వ్యేతిరేకత తప్పదని హెచ్చరించారు. మహాత్మా గాంధీ పేరు ఉపాధి పథకం నుండి తీసివేస్తే దేశవ్యాప్తంగా నిరసన చేపడతామన్నారు. గత యూపీఏ ప్రభుత్వం ఇచ్చినట్టుగా కేంద్ర ప్రభుత్వం 99శాతం నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జీసీసీ ఛైర్మెన్ కొట్నక్ తిరుపతి, ఆర్ జి పి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, పార్టీ మండల అధ్యక్షులు అక్కల వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ గడ్డం నాగరాణి, మాజీ ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిరికొండ నవీన్, మాజీ ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.

