Former Chief Minister | తెలంగాణ దిక్చూచి కేసీఆర్..

Former Chief Minister | హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ ; తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదిన సందర్భంగా హుజూర్‌నగర్ పట్టణంలో ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తు బారి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ చేసిన ఉద్యమం, చూపిన పట్టుదల, నాయకత్వం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, రైతు సంక్షేమం మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రజల జీవితాలలో కీలక మార్పులు తీసుకొచ్చాయి.

కెసిఆర్ కు దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తు, ఆయన చూపిన అభివృద్ధి మార్గంలో రాష్ట్రం మరింత ముందుకు సాగాలని మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ముఖ్య నాయకులు డా.కేఎల్ఎన్ రెడ్డి, కొప్పుల సైదిరెడ్డి జక్కుల నాగేశ్వరరావు బెల్లంకొండ అమర్ రెక్కల శంభిరెడ్డి, సారెడ్డి భాస్కరరెడ్డి కోల శ్రీనివాస్ మట్టారెడ్డి ములకలపల్లి రాంబాబు, నగేష్ రాథోడ్, అద్దంకి సైదేశ్వర్రావు, అలీ, కొండారెడ్డి, కొలపూడి చంటి కృష్ణకుమారి, రాగి రాజశేఖర్, జక్కుల వెంకటేష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply