మళ్లీ కారే కావాలి.. కేసీఆర్ సారే రావాలి

మళ్లీ కారే కావాలి.. కేసీఆర్ సారే రావాలి

  • సీడీసీ మాజీ చైర్మ‌న్ కాసాల బుచ్చిరెడ్డి

సంగారెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ‌ : ప్రజలు మళ్లీ “కారే కావాలి, కేసీఆర్ సారే రావాలి” అని కోరుకుంటున్నారని బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, సీడీసీ మాజీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి కేసీఆర్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ… మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశాయని, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజల మనుస్సును గెలుచుకుందని పేర్కొన్నారు. పోలీస్ అండ, డబ్బుల ప్రభావంతోనే మున్సిపల్ చైర్మన్ పదవి దక్కించుకున్నార‌ని ఆరోపించారు. డబ్బుల ప్రభావం, పోలీసుల అత్యుత్సాహం మధ్య వచ్చిన ప్రజా తీర్పును బీఆర్ఎస్ పార్టీ శిరసావహిస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే సహకారంతో పట్టణ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నారని, కాంగ్రెస్ నేత‌లు ఇచ్చిన హామీ మేరకు ప్రతి వార్డుకు రూ.8 కోట్లు మంజూరు చేసే వరకు నిరంతరం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

కేసీఆర్ తిరిగి రాక ఖాయమని ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నార‌ని బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు హక్కీమ్, డాక్ట‌ర్‌ శ్రీహరి, పట్టణ అధ్యక్షుడు ఆర్.వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింలు, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చక్రపాణి, మధుసూదన్ రెడ్డి, విఠల్, మల్లగౌడ్, రామప్ప, మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ అంజద్, యువత అధ్యక్షులు వాజిత్, శ్రవణ్ రెడ్డి, కౌన్సిలర్లు కొత్తపల్లి శ్రీకాంత్, జలందర్, లాడే మనిలా మల్లేశం, నక్క మంజులత నాగరాజ్ గౌడ్, పొన్న రాజేందర్ రెడ్డి, పొన్న దశరథ్ రెడ్డి, శ్రీకాంత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply