Sheikh Hasina | బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాని హ‌సీనాకు ఉరిశిక్ష‌

Sheikh Hasina | బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాని హ‌సీనాకు ఉరిశిక్ష‌

Sheikh Hasina | మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కు కూడా ఉరి


వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : బంగ్లాదేశ్ (Bangladesh)లోని గ‌త ఏడాది జులై-ఆగ‌స్టుల్లో జ‌రిగిన‌ అల్లర్ల కేసుకు సంబంధించి ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)ను దోషిగా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు (ICT) తేల్చింది. ఆమెకు ఉరి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో ఆమెపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. వీటిపై వాదనలు విన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) ఈ రోజు ఆమెను దోషిగా తేల్చి శిక్ష ఖ‌రారు చేసింది. బంగ్లాదేశ్‌లోని జరిగిన ఆందోళనల్లో 1400 మంది మృతి చెందారని ఐసీటీ న్యాయమూర్తి వెల్లడించారు.

తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయమని ఆమె ఆదేశాలు ఇచ్చారని నిర్ధారించుకున్నారు. ఈ కేసులో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ (Former Home Minister Asaduzzaman Khan) కు సైతం కోర్టు మరణశిక్ష విధించింది. ఆగస్టు 5న ఢాకాలో నిరసనకారులపై ఆర్మీ కాల్పులు జరిపిందని, వారిపై హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించాలని ఆమె ఆదేశించారని మరో న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఈ మేరకు దర్యాప్తు నివేదికను చదివి వినిపించారు.

గాయపడినవారికి వైద్యం అందించేందుకు నిరాకరించారన్నారు. ఆమె అధికారంలో ఉండేందుకు బలప్రయోగం చేశారని పేర్కొన్నారు. తీర్పు ఇవ్వడంలో ఏదైనా ఆలస్యం జరిగితే క్షమించాలన్నారు. ఈ తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్ రాజధాని నగరం ఢాకాలో హై అలర్ట్ ప్రకటించారు. ఎవరైనా వాహనాలు తగలబెట్టేందుకు, బాంబులు విసిరేందుకు ప్రయత్నిస్తే.. వారిని కాల్చివేయాలంటూ ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మహమ్మద్ సజ్జత్ అలీ ఆదేశాలు ఇచ్చారు.

Leave a Reply