అక్కడ పెద్దపులి.. ఇదిగో సాక్ష్యం..

అక్కడ పెద్దపులి.. ఇదిగో సాక్ష్యం..

ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం అభయారణ్యంలోని రేగళ్ల ఆళ్లపల్లి మండలం చింతొల్లగుంపు నర్సరీ మీదుగా లక్ష్మీపురం, పెద్దవెంకటాపురం రహదారి గుండా అనంతోగు గ్రామం అడవిలోకి ప్రవేశించి కాచనపల్లి మామకన్ను గ్రామాల దట్టమైన అడవిప్రాంతంలో ప్రవేశించిందని ఆళ్లపల్లి రేంజర్ కిరణ్ కుమార్ తెలిపారు. ఫారెస్ట్ సిబ్బంది అప్రమత్తమై పెద్దపులి పాదముద్రలను సేకరించడం జరిగిందన్నారు. రాత్రి పులి తనప్రయాణ దిశను కాచనపల్లి, మామకన్ను అడవిలోకి మార్చుకున్నట్లు దట్టమైన అడవిలో సంచరిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా వేసవిలోని ములుగు జిల్లా నుండి రేగళ్ల, ఆళ్లపల్లి రేంజి పరిధి గుండా అడివిలోకి ప్రవేశిస్తాయని అది సహజమేనని తెలిపారు.

పెద్దపులి తన ఇష్టానుసారంగా ప్రయాణ దిశను మార్చుకుంటూ భూపాలపల్లి, రామగుండం మందమర్రి, అదిలాబాద్, గంధంపల్లి అడవుల్లోకి ప్రవేశిస్తుందని తెలిపారు. స్థానిక గ్రామాల ప్రజలకు పశువులకు ఎలాంటి హాని తలపెట్టకుండా సంచారం చేస్తుందని, అనివార్య కారణాలతో ఒకవేళ ప్రజలు పశువులకు ప్రమాదకరం తలపెట్టితే అటవిశాఖ ఉన్నతాధికార్లకు సమాచారం ఇవ్వడం జరుగుతుందన్నారు. పెద్దపులికి అనారోగ్యం పాలైతే ఫారెస్ట్ సిబ్బంది ఆధ్వర్యంలో వైద్యచికిత్సలు నిర్వహించి, జంతుప్రదర్శనశాలకు పంపించడం జరుగుతుందన్నారు. పెద్దపులి సంచారంతో పలు గ్రామాలు మండలాల ప్రజలు రైతులు భయాందోళన చెందడంతో, అటవీశాఖ సిబ్బంది 4 రేంజీ పరిధిలోని 74 మంది బీట్ అధికార్లు,12 మంది సెక్షన్ అధికార్లు, 25 మంది రేంజర్లు, బేస్ క్యాంప్, వైల్డ్ లైఫ్ వాకిటాకీ బృందాలు అప్రమత్తమయ్యయని పాదముద్రలు సేకరించడం జరిగిందని తెలిపారు. ఏదేమైనా రేగళ్ల ఆళ్లపల్లి రేంజీల్లోని ప్రజలు రైతులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, హానితలపెట్టలేదని దాంతో పాల్వంచ అభయారణ్యంలోని అటవీశాఖ సిబ్బంది ఆదేశాల మేరకు ఒంటరిగా వెళ్లరాదన్నారు.

గ్రామస్తులు ఒంటరిగా తిరగకుండా అప్రమత్తంగా ఉండాలని రైతులకు చెందిన మూగజీవాలు పశువులు జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. పెద్దపులి ప్రమాదకరమైన జంతువు కావడంతో ప్రజలు, రైతులు, పశువులు ఎప్పటికప్పుడు మేలుకొని జాగ్రత్తపడాలన్నారు. రేగళ్ల రేంజ్ పరిధిలో గూండా ఆళ్లపల్లి మండలాల రేంజిలోకి ప్రవేశించడంతో, రైతులు, ప్రయాణికులు, ప్రజలు, బిక్కుబిక్కుమంటూ అరచేతిలో ప్రాణంపెట్టుకుని జీవించారన్నారు. గ్రామ రైతులు ప్రజలను దడపుట్టిస్తూ భయాందోళనలకు గురిచేయడం విచారకరం. రేగళ్ల ఆళ్ళపల్లి రేంజ్ మీదుగా కాచనపల్లి, మామకన్ను,భూపాలపల్లి అటవీప్రాంతానికి ప్రవేశించడంతో తనదిశను మార్చుకొని ప్రయాణించడంతో అటవీశాఖ అధికారులు, ఉమ్మడి మండలాల ప్రజలు, రైతులు, పశువుల కాపరులు, ఒంటరి ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారని రేగళ్ల, ఆళ్లపల్లి రేంజర్లు జస్వంత్ ప్రసాద్, కిరణ్ కుమార్ తెలిపారు.

Leave a Reply