వన్యప్రాణుల రక్షణ అందరి బాధ్యత…

వన్యప్రాణుల రక్షణ అందరి బాధ్యత…

కడెం ( నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : అడవులు వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని అడవులు వన్యప్రాణుల సంరక్షణతో పర్యావరణ సమతుల్యత కాపాడబడుతుందని కడెం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఏల్.గీతా రాణి అన్నారు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవ సందర్భంగా బుధవారం కడెం మండల కేంద్రంలో కడెం ఎఫ్ ఆర్ ఓ ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులు సిబ్బంది బైక్ ర్యాలీ అవగాహన కల్పించారు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎఫ్ ఆర్ ఓ గీత రాణి మాట్లాడుతూ అంతరించిపోతున్న అడవులను వన్య ప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పాండవ పూర్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పి.సిద్ధార్థ దస్తురాబాద్ ఎఫ్ ఎస్ ఓ జెడ్ కింగ్ ఫిషర్ రేంజ్ పరిధిలోని ఎఫ్బి ఓలు బేస్ క్యాంప్ వాచర్లు ఎనిమల్ ట్రక్కర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply