తొలిసారిగా డిజిటల్ విధానంలో..

తొలిసారిగా డిజిటల్ విధానంలో..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ (SSC) పరీక్షల పేపర్ వాల్యుయేషన్ నేటి నుంచి ప్రారంభమైంది. ఈసారి మూల్యాంకన ప్రక్రియలో కీలక మార్పు చోటుచేసుకుంది. తొలిసారిగా డిజిటల్ విధానంలో పేపర్ వాల్యుయేషన్ చేపడుతున్నారు. సంప్రదాయ పద్ధతికి భిన్నంగా, ఆన్సర్ షీట్లను స్కాన్ చేసి ఆన్‌లైన్ ద్వారా మూల్యాంకనం నిర్వహించే విధానాన్ని అధికారులు అమలు చేస్తున్నారు. పరీక్షా పత్రాల మూల్యాంకనంలో పారదర్శకత, వేగం పెంచడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.
అలాగే మానవ తప్పిదాలు తగ్గి, ఫలితాల ప్రకటన వేగవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన వాల్యుయేషన్ కేంద్రాల్లో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చినట్లు సమాచారం. కొత్త విధానంపై ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షణను కట్టుదిట్టం చేశారు. ఈ డిజిటల్ వాల్యుయేషన్ విధానం సక్సెస్ అయితే, భవిష్యత్తులో ఇతర తరగతుల పరీక్షల్లో కూడా అమలు చేసే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు సూచిస్తున్నాయి.
