ఏకలవ్య పాఠశాలలో ఉన్నతాధికారుల తనిఖీ

ఏకలవ్య పాఠశాలలో ఉన్నతాధికారుల తనిఖీ
దమ్మపేట, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై శుక్రవారం ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టారు. ఆహారం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో, ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజినల్ ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ రామోజీ రమేష్,జిల్లా ఆహార భద్రతా అధికారి శరత్ లు పాఠశాలను సందర్శించారు. చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిపై పట్వారిగూడెం వైద్యాధికారి దివాకర్‌ను అడిగి తెలుసుకున్నారు.
పాఠశాల ప్రిన్సిపాల్ సంజయ్ మలకార్ ను ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. స్టోర్ రూమ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్కడ నిల్వ ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించారు. వంట గది, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్ ,పాఠశాల పరిసరాలను వారు పరిశీలించారు.విద్యార్థుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వంట చేసే సిబ్బంది ఆహార తయారీలో జాగ్రత్తలు పాటించాలన్నారు.

