Bellampally | 200 మందికి అన్నదానం..

Bellampally | 200 మందికి అన్నదానం..
- 361వ వారానికి చేరుకున్న అమ్మ ఒడి అన్నదాత ప్రాజెక్ట్
Bellampally | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలో అమ్మ ఒడి ఎన్జీఓ అన్నదాత ప్రాజెక్ట్, టెక్నో డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాంటా చౌరస్తా పల్లెటూరి బస్టాండ్ ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 200ల మందికి అన్నదానం చేశారు. బెల్లంపల్లి పట్టణంలో ప్రతి ఆదివారం నిర్విరామంగా అన్నదానం కొనసాగించాలనే సదుద్దేశంతో 2020 ఏప్రిల్ 5న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని నిర్వాహకులు తెలిపారు.
ఆ రోజు నుంచి ఆకలితో అలమటించే యాచకులు, నిరుపేదలు, దినసరి కూలీలు, బాటసారులకు అన్నం అందిస్తూ ఈ కార్యక్రమం 361వ వారానికి చేరుకున్నట్లు అమ్మ ఒడి అన్నదాత ప్రాజెక్ట్ వ్యవస్థాపకుడు అజ్మీరా మోహన్, మంచిర్యాల జిల్లా బ్రాంచ్ మేనేజర్, టెక్నో డాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ హనుమాండ్ల మధుకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు సూరం బానేష్, గురుండ్ల సత్యనారాయణతో పాటు అమ్మ ఒడి సభ్యులు హనుమాండ్ల సువర్ణ, గన్నేవరం తిరుమల చారి, సిద్ధమల్ల రఘు, ఎండీ యుసుఫ్, చెందుపట్ల లింగమూర్తి, మాటూరి వరప్రసాద్, భరత్ రుషి, ఎండీ ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు.
