సంఘాల ఏర్పాటు పై దృష్టి పెట్టాలి….
బిక్కనూర్, ఆంధ్రప్రభ : వృద్ధులు దివ్యాంగుల సంఘాల ఏర్పాటు పై ఐకెపీసీ(IKPC) సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని కామారెడ్డి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి(Vijayalakshmi) చెప్పారు. ఈ రోజు బిక్కనూర్ మండల కేంద్రంలో గల ఐకేపీ కార్యాలయంలో సిబ్బంది ఆధ్వర్యంలో రివ్యూ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి మహిళా గ్రామ సంఘం బ్యాంకు లింకేజీ(Bank Linkage) ఉండాలని సూచించారు. వివిధ బ్యాంకుల ద్వారా గ్రామ సంఘాలకు వ్యాపారాల నిమిత్తం రుణాలు ఇప్పించాలని చెప్పారు. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి మహిళా గ్రామ సంఘంలో సభ్యురాలుగా ఉండాలన్నారు.
గ్రామాల్లో ఉన్న ప్రతి మహిళ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రామ సంఘాల ద్వారా చేస్తున్న వ్యాపారాల వివరాలను సేకరించి వారిని మరింత ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్వామి కార్యక్రమంలో ఐకెపి ఏపీఎం సాయిలు, సిబ్బంది పాల్గొన్నారు.

