నీటి సమస్యలపై దృష్టి సారించాలి..

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : రాబోయే వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా నీటి ఎద్దడి నివారణ పై దృష్టి సారించాలని సిర్పూర్ (యు) ఎంపీడీవో కృష్ణరావు అన్నారు. బుధవారం కొమరం భీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నర్సరీల నిర్వహణ ,మంచినీటి ఎద్దడి, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు తదితర అంశాలపై సమీక్షించారు. నర్సరీలకు ఇచ్చిన మొక్కల పెంపక లక్ష్యాన్ని అధిగమించాలని గ్రామాల్లో నీటి ఎద్దడి ఉన్న గ్రామాలను గుర్తించి నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోవాలని ఆయన ఉద్యోగులకు కోరారు. ఇంటి పన్నుల వసూలు పై దృష్టి సారించాలని ఎంపీడీవో కోరారు. పంచాయతీల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ ఓ ప్రమోద్, ఈజీఎస్ ఏపిఓ కనకయ్య, పంచాయతీల కార్యదర్శిలు, ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.
