కరవునేలలో వరద గలగల

  • కదిరిలో జనం గిలగిల
  • మదనపల్లి హైవేపై రాకపోకలు బంద్


ఆంధ్రప్రభ, శ్రీ సత్యసాయి బ్యూరో : శ్రీ సత్యసాయి జిల్లా (SriSathyaSaiDistrict) కదిరి ప్రాంతంలో రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా గురువారం రాత్రి కర్ణాటక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా కదిరి నియోజకవర్గం తనకల్లు మండల సమీపంలోని చీకటిమాని పల్లి వద్ద 42వ జాతీయ రహదారిపై భారీ ఎత్తున నీటి ప్రవాహం ప్రవహిస్తూ రావడంతో శుక్రవారం ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు రెండు గంటల పాటు కదిరి -మదనపల్లి (Kadiri – Madanapalle) రాకపోకలు నిలిచిపోయాయి.

ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సుమారు గంటసేపు జెసిబితో సహాయక చర్యలు చేపట్టి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. కాగా రెండు, మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కర్ణాటక ప్రాంతం (Karnataka region) లో కురుస్తున్న భారీ వర్షాల (HeavyRains) కారణంగా శ్రీ సత్యసాయి జిల్లా సరిహద్దులో గల పలు చెరువులు నిండి మరవ వెళ్తున్నాయి. ఇదే సందర్భంలో చిత్రావతి నది కూడా భారీగా ప్రవహిస్తూ చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు భారీ స్థాయిలో నీరు చేరుతున్న విషయం తెలిసిందే.

Leave a Reply