చుటూరుకు వరద పోటు

  • ఇంకెన్నాళ్లీ అవస్థలు
  • గిరిజనం ఆందోళన


ఆంధ్రప్రభ, చింతూరు, (ఏఎస్‌ఆర్‌ జిల్లా) : ఆదివాసీల బాధలు ప్రభుత్వాలకు పట్టడం లేదని ఏజేన్సీ ఆదివాసీలు వాపోతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) నిర్మాణంతో కష్టాలు మొదలైయ్యాయి, ఆ పోలవరం ప్రాజెక్ట్‌ ఎప్పుడూ పూర్తవుతుందో తెలియదు కానీ ఈ కష్టాలు మాత్రం ఇంతకి ఇంత పెరుగుతున్నాయని పోలవరం ముంపు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలో ఈ ఏడాది వరదలు వరుసుగా 5 వ సారి రావడంతో అల్లూరి జిల్లా (Alluri District) లోని చింతూరు ఐటీడీఏ పరిధిలోని నాల్గు మండలాల్లో వేలాది ఎకరాల పంటలు సర్వం నాశనమయ్యాయి. ఈ క్రమంలో చింతూరు మండలం ముకునూరు గ్రామ పంచాయతీ చుటూరు గ్రామానికి చెందిన గ్రామస్తులు వరద బాధలను భరించలేక బుధవారం వరద నీటిలో జలదీక్ష చేసి నిరసన వ్యక్తం చేశారు.

ఈ నిరసన కార్యక్రమానికి ఆ గ్రామం మొత్తం కదిలివచ్చి నడుము లోతు నీటిలో దీక్ష చేశారు. మా గ్రామానికి తక్షణమే పోలవరం పరిహారం ఇచ్చి వెంటనే పునరావాసం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఏ సంవత్సరం లేని వరదలు గత నాలుగైదు సంవత్సరాల నుండి వస్తున్నాయని, ఇవి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కాఫర్‌ డ్యాం (Coffer Dam) బ్యాక్‌ నీరని వరద బాధితులు ఆవేదన చేందారు. ఈ నాలుగైదు సంవత్సరాల నుండి వస్తున్న వరదలతో మేము విసిగిపోయాము ఇక మా వళ్ళకాదు ఇలాగే ప్రతి ఏడాది ఇలా వరదలు వస్తే మేము బ్రతకలేము అంటూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ ఏడాది వరదల వలన సర్వస్వం కోల్పోయమని, ఆర్దికంగా, మానసికంగా అన్ని విధలా దెబ్బతిన్నామని మమ్మళ్ళి ఆదుకునే నాధుడే కరవయ్యాడు.

పోలవరం ప్రాజెక్ట్‌తో సర్వశ్వం కోల్పోతున్నాం. మా గ్రామానికి తక్షణమే పోలవరం నష్ట పరిహారం ఇప్పించి పునరావాసం కల్పించండి (rehabilitation Provide). పునరావాసం కల్పించే చోట మౌళిక సదుపాయాలు కల్పిస్తే వెంటనే గ్రామం ఖాళీ చేసి వెళ్ళిపోతాం. ప్రతి ఏటా వరదలతో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఈ వరదలతో బాధలు పడలేం.

ప్రతి ఏటా వరదలతో తీవ్రంగా నష్టపోతున్నాం. మా కష్టాన్ని వరదలతో నష్టపోయి కన్నీళ్ళు మిగులుతున్నాయి. ఈ ఏడాదిలో వచ్చిన వరదలతో తీవ్రంగా నష్టపోయాం. ఈ వరదలతో మానసికంగా చితికిపోతున్నాం. ప్రభుత్వాలు పట్టించుకొని సమస్య పరిష్కారానికి చోరవ తీసుకోవాలి. వరద బాధితులను ఆర్ధికంగా ఆదుకోవాలి (Need financial support).

ప్రతి సంవత్సరం వరదలతో నిండా మునుగుతున్నాం. ఈ ఏడాది మరింత మునిగాం. ప్రస్తుత వరదలు పంటలు దెబ్బతీశాయి. వరదతో వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం ఇవ్వాలి. ప్రభుత్వం ఆదుకోపోతే మేము బ్రతికేది ఎలా. వరదల తరువాత ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలి (Seeds distributed).

ఈ ఏడాది వరదలతో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నాం. ఆఘస్టు నెల మొదలుకొని ఆక్టోబర్‌ నెల వచ్చినప్పటకీ వరదలు తగ్గలేదు. ఈ వరదలతో పనులు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ పని లేక ఇంట్లోనే ఉండి నిత్యవసరాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ఇప్పటీకైనా మా గ్రామ బాధలను అర్ధం చేసుకొని నిత్యవసరాలు అందించాలి (Essentials should be provided).

Leave a Reply