Flood victims | వరద బాధితులకు పరిహారం అందించాలి

Flood victims | వరద బాధితులకు పరిహారం అందించాలి

  • తాహసిల్దార్ కు లిస్ట్ అందజేసిన కార్పొరేటర్

Flood victims | కరీమాబాద్, ఆంధ్రప్రభ : మొంథా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన 34వ డివిజన్ శివనగర్ బాధితులందరికీ నష్ట పరిహారం అందించాలని 34 వ డివిజన్ కార్పొరేటర్ దిడ్డి కుమార స్వామి నష్టపరిహారం అందని వరద బాధితుల(Flood victims) లిస్టును మంగళవారం కిలా వరంగల్ మండల తాసిల్దార్ ఇక్బాల్ కు అందజేశారు.

34 డివిజన్ శివనగర్ కార్పొరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు వరద బాధితులకు పరిహారం పాక్షికంగానే అందిందని పూర్తిస్థాయిలో అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మేము సేకరించిన వివరాల ప్రకారం మరో 100మంది లబ్ధిదారుల(beneficiaries)కు పరిహారం అందాల్సి ఉందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన బాధితులు తనకు దరఖాస్తులు అందజేశారని న్యాయమైన బాధితులకు వరద ఆర్థిక సహాయం అందజేసి ఆదుకోవాలని ఆయన కోరారు.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కొరకు కమిటీ వేశారని ఆ కమిటీకి డివిజన్ కార్పొరేటర్ ను చైర్మన్ గా నియమించారని అదే కమిటీ చే వరద బాధితుల నిజమైన లబ్ధిదారుల నివేదికను తయారు చేయించాలని అప్పుడే నిష్పక్షపాతికంగా సహాయం(assistance) అందుతుందని ఆయన అన్నారు. డబుల్ బెడ్ రూమ్ లో మంజూరి గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి బి ఆర్ఎస్ ప్రభుత్వానికి లబ్ధిదారులు దరఖాస్తులు అందజేశారని వాటిలో కొందరిని ఎంపిక చేయడం జరిగిందవి అవి అర్హులైన వారి వేనా, కాదా అని విచారణ జరిపించి నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూంలు అందజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

శివనగర్ లో అండర్ డక్ట్ నిర్మాణం చేపడుతున్న తరుణంలో 9 మంది ఇల్లు కోల్పోయారని అందులో 4గురు ఎస్ సిలు, 3 గురు మైనార్టీలు, ఇద్దర బిసిలు ఉండగా వీరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు(double bedroom houses) మంజూరు అయి ఉన్నాయని. జిల్లా కలెక్టర్ దగ్గర అందుకు సంబంధించిన లిస్టు ఉన్నందున వారికి మొదటి ప్రాధాన్యతను ఇచ్చి వెంటనే వారికి అందజేయాలని కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి విజ్ఞప్తి చేశారు.

తనకు అందిన వరద బాధితుల ఆర్థిక పరిహారం లిస్ట్ కిలా వరంగల్ మండల్ తాసిల్దార్ కు సమర్పిస్తున్నానని కార్పొరేటర్ తెలిపారు. కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గోగుల ఇందిర,బిల్ల రాజు, డి ప్రభాకర్, ఇట్టబోయిన గణేష్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply