Nandyala | శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం..

మూడు గేట్లు ఎత్తి నీటి విడుదల
నంద్యాల బ్యూరో జూలై 28 ఆంధ్రప్రభ
నంద్యాల జిల్లా (Nandyal District) లోని శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం రోజు రోజుకు క్రమంగా పెరుగుతూంది. జూలై 4వ తేదీ నుంచి కురిసిన వర్షాల వల్ల, ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న ఇన్ ఫ్లో (In flow) పెరుగుతూ వస్తుంది. జూలై 28 సోమవారం అధికారులు మరో రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసారు. మధ్యాహ్నం 12గంటలకు మరో గేటు ఎత్తేసారు. ప్రస్తుతం మూడు గేట్ల ద్వారా నీటిని నాగార్జున సాగర్ (Nagarjunasagar) కు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరదలా వస్తోన్న నీరు శ్రీశైలం జలాశయానికి ఎత్తేసిన గేట్ల ద్వారా ప్రవాహం పరవళ్ళు తొక్కుతోంది.

జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి (Srisailam Reservoir) 1,27,392 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. శ్రీశైలం నుంచి ఔట్ ఫ్లో 1,40,009 క్యూసెక్కులు. రెండు స్పిల్‌వే గేట్ల ద్వారా 53,764 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20 వేల క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,930 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.40 అడుగులకు చేరింది.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 201.12 టీఎంసీలుగా నమోదైంది. పర్యాటకుల సందడి అధికమైంది. పర్యాటకుల రాకతో శ్రీశైలం పులకరించిపోతుంది.

ఇదీ చదవండి కొంపముంచిన సెల్ఫీ పిచ్చి

పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలి…
పరవళ్ళు తొక్కుతున్న ప్రవాహంతో కళకళలాడుతున్న శ్రీశైలం జలాశయం వద్ద పర్యాటకుల సందడి పెరుగుతోంది. అయితే అంతటా నీటి తడి బాగా ఉండడం వల్ల ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, జారి పడిపోయే ప్రమాదం ఉంటుంది. అంతే కాక, సెల్ఫీల కోసం, రీల్స్ కోసం జలాశయం దగ్గరికి వెళ్ళి ప్రమాదకరంగా ప్రవర్తించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒక్కోసారి ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోతే చాలా కష్టం. అందుకే పిల్లలు, పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతున్నారు అధికారులు. ప్రకృతి శోభను తిలకించడానికి వచ్చిన పర్యటన సంతోషంగా ముగిస్తే బాగుంటుంది కానీ విషాదాంతం చేసుకోవద్దని అధికారులు పదే పదే హెచ్చరిస్తున్నారు.

Leave a Reply