Flex | సీఎం, డిప్యూటీ సీఎంకి అవమానం..

Flex | సీఎం, డిప్యూటీ సీఎంకి అవమానం..

Flex | ఏలూరు కార్పొరేషన్, ఆంధ్రప్రభ : ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం గాలయగూడెం గ్రామంలో గ్రామ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోపాటు మంత్రి నాదెండ్ల మనోహర్ ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్స్(Flex) పై గుర్తు తెలియని వ్యక్తులు పేడ రాసిన ఘటన చోటు చేసుకుంది.

అంతే కాకుండా దెందులూరు నియోజకవర్గం(constituency) శాసనసభ్యులు చింతమనేని ఫోటోకి కూడా పేడ రాయడంతో ఈ ఘటన పై గ్రామంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Flex |

సాక్షాత్తు గ్రామ సచివాలయంలో సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలు పై అసభ్యకరంగా గత కొంతకాలంగా ఫోటోలు దర్శనమిస్తున్నా సచివాలయ సిబ్బంది మాత్రం ఆ ఫ్లెక్స్ తొలగించకపోవడంతో గత వైసీపీ ప్రభుత్వాని(government)కి సిబ్బంది కొమ్ముకాస్తున్నారంటూ ఆరోపణలు వినబడుతున్నాయి.

నిత్యం ఏదో ఒక పని మీద గ్రామ ప్రజలు సచివాలయానికి వస్తూ ఉంటారని ఇలాంటి ఫ్లెక్స్ లు దర్శనం ఇవ్వడంతో గ్రామంలోని కూటమి పార్టీ, వైసీపీ పార్టీ నేతల మధ్య భారీగా ఘర్షణలు జరిగే అవకాశం ఉందంటూ పలువురు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గత కొంతకాలంగా సచివాలయంలో దర్శనమిస్తున్న ఫ్లెక్స్ ను పట్టించుకోని సచివాలయ సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Flex |

Leave a Reply