Five people | ఐదుగురికి గాయాలు..

Five people| ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సింగరాయకొండ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డివైడర్‌ను ఢీకొన్న కారు బోల్తా పడడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు సింగరాయకొండ జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగి అగ్నికి ఆహుతైంది.
ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమవడంతో భారీ నష్టం వాటిల్లింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
