• లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన


జైనథ్, ఆగస్టు 16 (ఆంధ్రప్రభ) : ఉమ్మడి జైనథ్ మండలం (jainad mandal) లోని కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాగులు వంకలు (Streams and meanders) పొంగిపోవడంతో పాటు ప్రాజెక్టు (project)కు వరద పోటెత్తుతుంది . దీంతో ప్రాజెక్టులు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. సాత్నాల ప్రాజెక్టు (Sathnala Project) కు సుమారు 3,500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో పెరగడంతో ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.


ప్రాజెక్టు దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జైనథ్ మండలంలోని తర్ణంవాగు (tarnam vagu) పొంగి పొర్లుతున్న నేపథ్యంలో రాకపోకలు నిలిచిపోయాయి. చేపల వేటకు వెళ్లే ప్రజలు వాగుల దగ్గరికి వెళ్లకూడదని అధికారులు సూచించారు.

Leave a Reply