సయ్యద్ సేవానిరతికి సముచిత సత్కారం..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మందనపల్లి లోని ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎండి సయ్యద్ ను గ్రామస్తుల సమక్షంలో ఘనంగా సత్కరించారు. సయ్యద్ తన తండ్రి జ్ఞాపకార్థం స్థాపించిన ఎస్ ఎల్ ఫౌండేషన్ ద్వారా గ్రామానికి చెందిన ఒక పేద విద్యార్థిని డిగ్రీ వరకు చదివి ఎందుకు అయ్యే ఖర్చు భరించనున్నట్టు ప్రకటించి భరోసా కల్పించారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్ళాలన్న లక్ష్యంతో ఎంతో కాలంగా ఉపాధ్యాయుడిగా సయ్యద్ అంకిత భావంతో చేస్తున్న కృషికి నిదర్శనంగా ఈ ప్రత్యేక సత్కారం జరిగింది. స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మంజుల, సర్పంచ్ సిరిమర్తి రేణుక, ఉప సర్పంచ్ శశిరేఖ, వార్డ్ మెంబర్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.
