Fitness | స్కూల్ యజమాన్యం నిర్లక్ష్యంతో బస్సు అగ్ని ప్రమాదం…

Fitness | స్కూల్ యజమాన్యం నిర్లక్ష్యంతో బస్సు అగ్ని ప్రమాదం…

  • బిజెపి మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్,

Fitness | చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని చల్లగరిగేకి చెందిన రైసింగ్ సన్ స్కూల్ బస్సు ఫిట్నెస్ లేని కారణంగా గత 4 రోజుల క్రితం జూకల్ శివారులో బస్సులో మంటలు లేచి దగ్ధమైందని, ప్రమాదం నుండి విద్యార్థులు తృటిలో తప్పించుకున్నారని,బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్, అన్నారు. మంగళవారం బస్సు దగ్ధమైన స్థలాన్ని బిజెపి మండల పార్టీ బృందం పరిశీలించారు.

అనంతరం వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ, ఆర్టిఏ అధికారులు, మామూళ్ల మత్తులో ఉండడం, గత నాలుగు రోజుల క్రితం చల్లగరిగ రైజింగ్ సన్, ప్రైవేట్ స్కూల్ నుండి పిల్లలను ఇంటికి తీసుకొచ్చే క్రమంలో జూకల్ గ్రామ శివారులో ఒకసారిగా మంటలు చెల్లరేగడంతో అందులో ఉన్న స్కూలు విద్యార్థులు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు , బస్ డ్రైవర్ కిందికి దింపడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారన్నారు.

ఈ ఘటనలో ఇప్పటివరకు అధికారులు, స్కూల్ యజమాన్యంపై విచారణ జరపకుండా నిమ్మకు నీరెత్తినట్టువ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. సంబంధిత మండల విద్యాశాఖ అధికారులు , డిఈఓ, ఆర్టీవో అధికారులు ప్రైవేట్ స్కూలు తనిఖీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు . స్కూలు బస్సు లో విద్యార్థులకు ఎటువంటి ప్రాణాపాయం లేదని కానీ ఒకవేళ ఏదైనా సంభవిస్తే వారి తల్లిదండ్రులకు తీరని శోకంగా మారేదని అన్నారు.

ఇప్పటికైనాసంబంధిత, అధికారు,లు స్పందించి స్కూల్ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బుర్ర వెంకటేష్ గౌడ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు గజనాల రవీందర్, గుండా మణికుమార్, సాదా సదానందం, ర్యకం శ్రావణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply