ఫిఠాపురం ఈదురుగాలి బీభత్సం
పిఠాపురం, ఆంధ్రప్రభ : మొంథా తుపాను ప్రభావం మంగళవారం ఉదయం నుంచీ తీవ్రమైంది. గంటకు 60 కిలోమీటర్ల(60 kilometers) వేగంతో గాలులు వీచాయి. తుపాను తీరం దాటకుండానే జిల్లాలో గాలులు వేగవంతం అయ్యాయి. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నేల నాని, వేళ్లు బలహీనంగా వున్న చేట్లు గాలులకు నేలకొరిగాయి. పిఠాపురం చర్చి సెంటర్ వద్ద భారీ వృక్షం నేలకొరిగింది.
మొయిన్ రోడ్డు(Moin Road మధ్యగా చెట్టు విరిగి పడటంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. చెట్టు కాస్తా విద్యుత్ ట్రాన్ఫార్మర్ పై పడటంతో విద్యుత్ స్తంభాలు, ట్రాన్ఫార్మర్ విరిగి పడ్డాయి. చెట్టు పడే సమయంలో ప్రయాణికులు కకావికలు కావడం, విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానిక స్టెట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద భారీ వృక్షం కూలిపోయింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పలు చెట్లు విరిగిపడ్డాయి.

రోగులు, వారి సహాయకులను బయట తిరగకుండా వార్డుల్లోకి పంపడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. గ్రామాల్లో సైతం ఇదే పరిస్థితి కనిపించింది. చెట్లు విరిగిపడటంతో, విద్యుత్ సరఫరా(electricity supply నిలిపేశారు. యు కొత్తపల్లి మండలం మూలపేట వద్ద విద్యుత్ స్తంభం విరిగిపడింది. గొల్లప్రోలులో చేలల్లోకి వరద నీరు చేరింది. చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి.

