Fish venkat | ఫిష్ వెంకట్ కన్నుమూత.. విషాదంలో చిత్రపరిశ్రమ

టాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. ఫిష్ వెంకట్ మరణ వార్త తెలిసిన పలువురు సినీ సెలబ్రిటీలు ఈయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.

విలన్ పాత్రలతో పాటు కమెడియన్‌గా కూడా ఎంతో మంది ప్రేక్షకులను నవ్వించిన ఫిష్ వెంకట్, రెండు కిడ్నీలు విఫలమైన కారణంగా కొంతకాలంగా డయాలసిస్‌పై ఆధారపడి ఉన్నాడు. ఇటీవల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.

అతనికి అవసరమైన కిడ్నీ మార్పిడికి దాదాపు రూ.50 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు సూచించగా, ఆ మొత్తాన్ని భరించలేక అతని భార్య, కుమార్తె సినీ ప్రముఖులను, ప్రభుత్వాన్ని, అభిమానులను సహాయం కోరారు. కొంతమంది సినీ ప్రముఖులు ఆయనకు ఆర్థికంగా సహాయం చేసినప్పటికీ, ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. వెంకట్ మరణం టాలీవుడ్ కు తీరని లోటు అని అభిమానులు, సహ నటులు అభివర్ణిస్తున్నారు. ఆయనతో కలిసి పనిచేసిన సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

One thought on “Fish venkat | ఫిష్ వెంకట్ కన్నుమూత.. విషాదంలో చిత్రపరిశ్రమ

Leave a Reply