ప్రజలు సహకరించాలి..

కడెం (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : వేసవికాలం ప్రారంభమైన నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగకుండా ప్రజలు సహకరించాలని కడెం ఎఫ్ఆర్ఓ గీతారాణి, డిఆర్ఓ సిద్ధార్థ కోరారు. ఆదివారం కడెం మండలం పాండవపూర్ గ్రామంలో గ్రామస్తులకు అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ ఆటవి నిప్పు నివారణ చర్యలపై గ్రామస్తులకు వివరించి అవగాహన కల్పించారు.
ఉద్దేశపూర్వకంగా అటవీ ప్రాంతాల్లో నిప్పు పెట్టిన, వన్యప్రాణులకు హాని కలిగించిన చట్టరీత్య కఠిన చర్యలు ఉంటాయన్నారు. వన్యప్రాణుల సంరక్షణకు అందరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాండవ పూర్ గ్రామ సర్పంచ్ ఆడే విజయ ఉత్తర్ ఉప సర్పంచ్ మధుకర్ జి పి వార్డు సభ్యులు ఎఫ్ బి ఓ నూమన్, అటవీ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.
