Fire | రాంకీ లో పేలిన రియాక్టర్ – రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది

కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ తండా 2లోని రాంకీ వెస్ట్ మేనేజ్మెంట్ లో బుదవారం ఉదయం రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తక్షణమే స్పందించిన సిబ్బంది ఫైర్ స్టేషన్ కు సమాచారం చేరవేయడంతో పాటు పరిశ్రమలో ఉన్న అగ్ని మాపక పరికరాలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.

సంఘటన స్థలానికి ఫైర్ ఇంజిన్లు చేరుకుని వెంటనే మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. స్తానిక విద్యార్థి నాయకుడు రాజేష్ మాట్లాడుతూ తరచూ రాంకీలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి రాంకీ సంస్థ ను దుండిగల్ నుండి తరలించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply