Fire | ఇన్ స్టిట్యూట్ లో విద్యార్థులు…

Fire |ఇన్ స్టిట్యూట్ లో విద్యార్థులు…
Fire | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలోని అమీర్ పేట్ (Ameerpet) లోని మైత్రీవనం చౌరస్తా దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. నీలగిరి బ్లాక్ భవనంలో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగలు అలుముకున్నాయి. నాలుగో అంతస్తులోని ఇన్ స్టిట్యూట్ (Institute) లో విద్యార్థులు చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న రెస్య్కూ టీమ్ విద్యార్థులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇన్ స్టిట్యూట్ లో అగ్నిప్రమాదం జరగడంతో ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. స్టూడెంట్స్, ఉద్యోగులు ఆ భవనం వద్దకు చేరుకుని సహాయకచర్యల్లో పాల్గొంటున్నారు.
