Fire hazard | హీటర్ ఆన్ చేసి వదిలేయడంతో…

Fire hazard | పాయకాపురం, ఆంధ్రప్రభ : విజయవాడ పాయకాపురం పోలీస్ స్టేషన్ రోడ్డులో ఈరోజు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హీటర్ ఆన్ చేసి వదిలేయడంతో కరెంట్ వైర్లు కాలి అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని ప్రాథమిక సమాచారంగా ఉంది. ఈ సంఘటనలో వాషింగ్ మిషన్, గ్యాస్ బండ పేలి ఇల్లు, ఇంట్లోని వస్తువులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. సమాచారం మేరకు అగ్ని మాపక సిబ్బంది సంఘటన స్థలాన్ని చేరుకుని మంటలు అదుపు చేశారు. బాధితుల నుండి సిబ్బంది వివరాలు తెలుసుకుంటున్నారు.
